డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ
వలసదారుల విధానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయానికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఏదైనా దేశస్థుడు అమెరికా వచ్చి 30 రోజుల్లోపు తనకు ఆరోగ్య బీమా ఉందని నిరూపించుకోవాలని లేని పక్షంలో కొత్త హెల్త్ ఇన్స్‌రెన్సూ పాలసీని తీసుకోవాలని ట్రంప్ సర్కారు కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధనను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఒరెగాన్లోని జిల్లా జడ్జి మైఖేల్ సైమన్ ఉత్తర్వులు జారీ చేశారు. హెల్త్‌కేర్ నిబంధనను సవాల్ చేస్తూ ఏడుగురు అమెరికా పౌరులు ఒక ఎన్జీవో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది వేలాది మంది చట్టబద్ధమైన వలసదారులకు ప్రతిబంధకంగా మారడంతో పాటు ఫ్యామిలీ స్సాన్సర్డ్ వీసాలతో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోకి వస్తున్న వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గేందుకు దోహదం చేస్తుందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. విచారణ సందర్బంగా జడ్జి సైమన్ మాట్లాడుతూ ఈ నిబంధన అమెరికా వ్యాప్తంగా కుటుంబాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నందున నిషేధం ఆమోద యోగ్యమైనదేనని అన్నారు.













