కన్నుల పండువగా అమెరికా స్వాతంత్య్ర వేడుకలు
అమెరికా 241 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా కన్నుల పండువగా జరిగాయి. కళ్ళు మిరిమిట్లు గొలిపేలా బాణాసంచా పోటీలతో సహా పలు వేడుకలు నిర్వహించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సైనిక కుటుంబాలకు వైట్‌హౌస్‌లో పిక్నిక్ ఏర్పాటు చేశారు. అమెరికా స్వాతంత్య్రాన్ని ప్రకటిస్తూ జారీ చేసిన డిక్లరేషన్ ఒరిజినల్ కాపీల్లో ఒకదాన్ని బోస్టన్లోని మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. నగరంలో జరిగిన బాణసంచా ప్రదర్శనలను వేలాదిమంది ప్రజలు వీక్షించారు. సెప్టెంబరు 11 దాడుల్లో మరణించిన దాదాపు 3వేలమంది స్మృత్యర్థం న్యూయార్క్‌లోని నేషనల్ మెమోరియల్ వద్ద ప్రజలు ఘనంగా నివాళి అర్పించారు.













