భారత్‌కు అమెరికా మద్దతు..
చైనా వెన్నుపోటుకు గురైన భారత్‌కు అమెరికా మద్దతుగా నిలిచింది. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వద్ద చైనా దుడుకు వైఖరి కారణంగానే పరిస్థితి దిగజారిందని అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో చైనాపై మండిపడ్డారు. చైనా తన పొరుగు దేశాల విషయంలో దుడుకు వైఖరి అవలంబిస్తోందని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌తో సరిహద్దు వివాదం ముదిరేలా చేసింది చైనా ఆర్మీయే. దక్షిణ చైనా సముద్రంలో మిలటరీ దళాలను మోహరిస్తూ చట్టవ్యతిరేకంగా ఆయా ప్రాంతాలను తన ఆధీనంలో తెచ్చుకుంటోంది. సముద్ర రావాణా మార్గాల్లో అశాంతిని సృష్టిస్తోంది అని డెన్మార్క్ లో జరిగిన ఓ సమావేశంలో మైక్ సూటి వ్యాఖ్యలు చేశారు. హాంకాంగ్ స్వాతంత్య్రానికి ముగింపు పలికిందని కూడా చైనాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో అంతర్జాతీయ ఒప్పందాలను చైనా ఉల్లంఘించిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.













