ఎన్నికల ప్రచారంలో మెలానియా ట్రంప్
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మెలానియా ట్రంప్‌కు కరోనా సోకడంతో ఆమెపై ప్రయాణ ఆంక్షలు విధించారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న మెలానియా ట్రంప్ పెన్విల్వేనియా ర్యాలీలో అధ్యక్షుడితో కలిసి పాల్గొంటారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఇతర కుటుంబ సభ్యులు చురుకుగా పాల్గొంటున్నారు. ఈ వారం ఇవాంకా ట్రంప్ మిచిగాన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, ఫ్లోరిడాలోని సభల్లో పాల్గొననున్నారు.













