దలైలామాతో అమెరికా రాయబారి భేటీ
టిబెటన్ల ఆధ్మాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపికకు తమ ఆమోదం తప్పనిసరని చైనా పేర్కొంది. దలైలామా వారసుడిని టిబెటన్లే ఎన్నుకుంటారని, ఇందులో చైనా జోక్యం అవసరం లేదని అమెరికా పేర్కొన్న నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది. అమెరికా రాయబారి సామ్ బ్రౌన్బ్యాక్ హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో దలైలామాతో భేటీ తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ ఆధ్మాతిక గురువును ఎన్నుకునే హక్కు టిబెటన్లకున్నది. ఇందులో ఏ ప్రభుత్వం, ఏ సంస్థ జోక్యం అవసరం లేదు అని తెలిపారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్ షైవాంగ్ స్పందిస్తూ అమెరికా రాయబారి వ్యాఖ్యలు చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లాంటిదేనని చెప్పారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.













