మోసగించే దేశాలపై ఉక్కుపాదం : డొనాల్డ్ ట్రంప్
తయారీ రంగంలో ఉద్యోగాలను స్వదేశానికి రప్పించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. శ్వేతసౌధంలో జరిగిన మేడ్ ఇన్ అమెరికా రౌండ్‌టేబుల్ సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. అమెరికాను మోసగించే దేశాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అమెరికా వనరుల దోపిడీని అరికట్టడంతో పాటు, తమ దేశ కంపెనీలు, పరిశ్రమలు, శ్రామికులకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మేడ్ ఇన్ అమెరికా ఓ ఉత్పత్తో, బ్రాండోకో పరిమితం కాదని, అది శ్రేష్ఠతకు చిహ్నమని పేర్కొన్నారు. శ్రామికుల గౌరవం, నైపుణ్యాలకు అది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.













