నిర్లక్ష్యం చేస్తే అమెరికాలో రోజుకు లక్ష కేసులు
పౌరులు ఆరోగ్య నిపుణుల సూచనలు పాటించకపోతే రోజు వారీ (కొత్త) కేసుల సంఖ్య లక్షకు చేరుకుంటుందని వైద్య నిపుణుడు, అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ చీఫ్ ఆంతోనీ ఫౌసీ హెచ్చరించారు. వైద్యుల సలహాలు లెక్క చేయకుండా జనం గుమి కూడటం, మాస్కులు ధరించకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మన దేశంలో ఇప్పుడు రోజుకు 40 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఏదో ఒకరోజు ఈ సంఖ్య లక్షకు చేరుకున్నా అది నాకు ఆశ్చర్యం కలిగించదు. కానీ, అది ఎంతో ఆందోళనకరమని ఫౌసీ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, పరిశ్రమలు తిరిగి ప్రారంభించే యోచనపై తన అంచనాలను కచ్చితంగా చెప్పలేనని అన్నారు. తనకు మాత్రం అది ఎంతో ఆందోళన కలిగిస్తుందన్నారు.













