భారత్ కు అమెరికా ఝలక్
ఇండియా, బ్రిటన్, యూరప్‌లోని దేశాలు అమెరికా టెక్ కంపెనీలు టార్గెట్‌గా డిజిటల్ సేవల పన్నులు విధిస్తున్నాయని, దీనిపై విచారణ ప్రారంభిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గతేడాది ఫ్రాన్స్‌లో ట్రేడ్ ఇన్వెస్టిగేషన్ చేసిన అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ ఇప్పుడు బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, టర్కీ, ఇండియా వాణిజ్య పన్నుల పరిశీలనపై దృష్టి సారించింది. అన్యాయమైన పన్ను విధానాల నుంచి తమ కంపెనీలను కాపాడుకునేందుకు ఆయా దేశాల్లో పన్నులు విధిస్తున్న తీరుపై విచారణ చేపడుతోంది అమెరికా. తమ వాణిజ్య భాగస్వాముల్లో చాలా మంది అమెరికా కంపెనీలను లక్ష్యంగా చేసుకుని డిజైన్ చేసిన ట్యాక్స్ స్కీమ్స్ అవలంబిస్తున్నారని ట్రంప్ అన్నారు. తమ బిజినెస్, వర్కర్స్‌ను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉందని వివరించారు.













