అమెరికా కీలక నిర్ణయం… వీసాల ఎంపికకు కొత్త రూల్స్
హెచ్-1బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరాఇకి జజారీ చేసే వీసాల ఎంపిక ప్రక్రియకు కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇకపై ఒక లబ్ధిదారు బహళ దరఖాస్తులు చేసుకున్న ఒకే అప్లికేషన్‌గా పరిగణించనున్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా, దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం ఈ కేంద్రీకృత ఎంపిక ప్రక్రియ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మొదలయ్యే వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ నిబంధనలను అమలు చేయనున్నారు. అంతేగాక, ప్రతి లబ్ధిదారు సరైన పాస్‌పోర్టు వివరాలు, ప్రయాణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. తప్పుడు సమాచారం ఇస్తే ఆ పిటిషన్లను తిరస్కరించే లేదా రద్దు చేసే అవకాశం యూఎస్సీఐఎస్కు ఉంటుంది. పాస్‌పోర్టు, ఇతర గుర్తింపు వివరాల ఆధారంగా దరఖాస్తుదారుడి రిజిస్ట్రేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.







