అమర్నాథ్ యాత్ర చేపట్టిన ఇద్దరు అమెరికన్లు
బోలేనాథుడిని దర్శనం కోసం అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఇద్దరు అమెరికన్లు కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఇద్దరు శ్వేతజాతీయులు ఈ యాత్రకు వచ్చారు. హిమాలయ గుహల్లో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకున్నారు. స్వామీ వివేకానంద అమర్నాథ్ దర్శనం చేపట్టారని, ఆయనకు ఎంతో మంచి అనుభవం కలిగిందని, ఎన్నో ఏళ్ల నుంచి ఈ కథ తనకు తెలుసు అని, తాము అమర్నాథ్ దర్శనం కోసం రావడం సంతోషంగా ఉందని అమెరికన్లు తెలిపారు. బోలేనాథుడి కృప వల్ల దర్శనం బాగా జరిగిందని, ఆ ఫీలింగ్‌ను వ్యక్తం చేయలేకపోతున్నట్లు అమెరికన్లు చెప్పారు.













