ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తులసి గాబార్డ్
అమెరికా అధ్యక్ష పదవికి తాను పోటీపడనున్న విషయాన్ని డెమోక్రటిక్ నేత తులసి గాబార్డ్ అధికారికంగా ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల కోసం ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. స్వదేశంలో, విదేశాల్లో శాంతిస్థాపన దిశగా ఉద్యమించేందుకు నాతో చేతులు కలపండి. అందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, అవకాశాలు అందిస్తామంటూ అమెరికా చేసిన వాగ్దానం ఈ ఉద్యమంతో సాకారమవుతుంది. నేడు మా ప్రచార పర్వాన్ని మొదలు పెడుతున్నాం అని ట్విటర్లో గాబార్డ్ పేర్కొన్నారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆమె విమర్శలు గుప్పించారు.













