సియాటెల్ లో టిటిఎ బతుకమ్మ వేడుకలు
వాషింగ్టన్లోనీ సియాటెల్ నగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో, వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (వాటా), వాషింగ్టన్ తెలుగు సమితి (వాట్స్) సౌజన్యంతో ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికీ ప్రతీకగా ఉన్న సాంప్రదాయబద్దంగా బతుకమ్మలను పేర్చి మహిళలు పూజలు నిర్వహించారు. టిటిఎ ఫౌండర్ డా. మల్లారెడ్డి పైళ్ల, అడ్వైజరీ చైర్ డా. విజయపాల్ రెడ్డి, కోచైర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, మెంబర్ భరత్ రెడ్డి మాదాడిల అద్వితీయ సహకారంతో కార్యదర్శి కవితారెడ్డి ఈ కార్యక్రమాలను సమన్వయపరిచారు.













