ఛార్ల్లెట్లో టిటిఎ అలయ్ బలయ్ జాతర
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను, అలయ్ బలయ్ జాతర, బోనాల వేడుకలను అమెరికా అంతటా టిటిఎ ఫౌండర్ డా. పెళ మల్లారెడ్డి అశీసులతో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అడ్వైజరీ చైర్ డా విజయపాల్ రెడ్డి, అడ్వైజరీ కోచైర్ మోహన్ రెడ్డి పటోళ, మెంబర్ భరత్ రెడ్డి మాదాడి సహకారంతో, ప్రెసిడెంట్ వంశీ రెడ్డి అధ్యక్షతన జరిగిన టిటిఎ అలయ్ బలయ్ జాతరకు వివిధ నగరాలలో జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. టిటిఎ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది స్వంత నగరమైన ఛార్ల్లెట్లో అలయ్ బలయ్ జాతర సంబురాలు అంబరాన్ని అంటాయి. మీడియా కమ్యూనికేషన్ డైరెక్టర్ నిశాంత్ సిరికొండ, బోర్డు డైరెక్టర్స్ శ్రీకాంత్ గాలి, శివ కారుమూరు,అభిలాష్ ముదిరెడ్డి, నేతృత్వంలో టిటిఎ ఛార్లెట్ టీం మార్విన్ ఎఫైర్డ్ పార్క్ లో ఆగష్టు 18న నిర్వహించిన సంబురాలు నాలుగు వందల మంది ఆహుతులతో కిక్కిరిసింది. ఆర్గనైజర్స్ రాఘవేంద్ర ఛామల, కవిత గుండేటి, నిఖిత, సూక్ష్మ, అరుణ్ కొత్తూరు చాల బాగా ఏర్పాట్లు చేసారు. నాటు కోటి మరియు మటన్ బాగారా అన్నం తో విచ్చేసిన మెంబెర్స్ కి చార్మినార్ దేసి అడ్డా రెస్టారెంట్ వారు చక్కని విందు భోజనం ఏర్పాటు చేశారు.
విచ్చేసిన వారందరు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రమోద్ అట పాటలతో అలయ్ బలయ్ చేసుకున్నారు. షార్లెట్ అలయ్ బలయ్ జాతర విజయవంతం చేసిన ఛోర్లెట్ టీం కి ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లి పెద్ది ధన్యవాదాలు తెలియచేశారు. టిటిఎ ఛార్లెట్్ టీం అంకుష్, ఆహ్లద రెడ్డి, దిలీప్,ప్రవీణ్ రెడ్డి, భరత్, నరేన్, దీప్తి, రమేష్, శిరీష, వెంకట్, మహేష్, ప్రమోద్, సతీష్ సిరికొండ తదితరులు వచ్చిన వారి అందరికి ధన్యవాదాలు తెలియచేసి విజయవంతంగా ముగించారు.







