ఆంటోనీ ఫౌచికి ఉద్వాసన!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు, ఆ దేశంలోని జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐఏఐడీ) డైరెక్టర్ ఆంటోనీ ఫౌచికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు కనపడుతోంది. ఫౌచి తాజాగా ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదానికి దారితీసింది. భౌతిక దూరం, లాక్డౌన్ వంటి నిబంధనలను మొదట్లోనే అమలు చేసి ఉంటే ప్రాణనష్టం తప్పి ఉండేదా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. మొదట్లోనే చర్యలు చేపట్టి ఉండే ప్రాణాలు నిలిచేవని చెప్పొచ్చు అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఆంక్షలను ఒక్కసారిగా సడలించడానికి బదులు ఆ పక్రియను క్రమంగా చేపట్టాలని కోరారు. ఆంక్షలు సడలించాక కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనీ హెచ్చరించారు. ఈ ఏడాది నవంబర్ 3న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు వ్యక్తిగతంగా వెళ్లి ఓటు వేయడం సురక్షితమేనా అన్నది తాను చెప్పలేనన్నారు. ముందే తగిన చర్యలను ప్రకటించి ఉంటే ప్రాణ నష్టం తగ్గేదన్న ఫౌచి వ్యా్య•లను రిపబ్లికన్ పార్టీ నేత ఒకరు ప్రస్తావిస్తూ..ఆయనకు ఉద్వాసన పలకాల్సిన సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారు. దీన్ని ట్రంప్ తిరిగి ట్వీట్ చేయడం ఊహాగానాలకు తావిచ్చింది. ఫౌచికి ఉద్వాసన తప్పదన విశ్లేషణలు మొదలయ్యాయి.













