వలసదారులకు ట్రంప్ భరోసా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి యూనియన్ కాంగ్రెస్‌నుద్దేశించి మాట్లాడనున్నారు. ప్రధానంగా ఆయన ఆర్థిక వ్యవస్థ, వలసదారులు, పన్ను విధానంలో సంస్కరణల విషయమై ప్రసంగించే అవకాశం ఉందని పలువురు రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ప్రజల్లో తనను తాను నిలదొక్కుకోవడానికి ఇదో మంచి అవకాశం అని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ది స్టడీ డైవర్సిటీ, డెమోక్రసీ డైరెక్టర్, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అల్విన్ బి టిల్లర్ట్ చెప్పుకొచ్చారు. అమెరికాలోని రాజకీయంతో పాటు అభివృద్ధిపై లోతుగా అధ్యయనం చేశానని, దీంతోపాటు జాతి, జాతీయ రాజకీయాలు, మీడియాపై దృష్టి సారించానని టిల్లర్ట్ చెప్పుకొచ్చారు. గత కొద్ది వారాలుగా వలసవాదులపై అమెరికా వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అందుకే దీనికి సంబంధించిన ఏదో అంశంపై ట్రంప్ తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దీంతోపాటు మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం విషయంపై సెనేట్‌లో చర్చ జరుగుతోందని వివరించారు. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలొని డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జైమే డోమినిగ్యూజ్ మాట్లాడారు. ట్రంప్ ప్రసంగంలో వలసదారుల విషయమై ప్రధానంగా ఉంటుందని ఆయన అన్నారు. డ్రీమర్స్‌కు ఊరట కల్పించే విధంగా కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని డోమినిగ్యూజ్ అన్నారు. మౌలిక సదుపాయాలు, పథకాలు, స్పీచ్ కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు విద్యావేత్త, ప్రొఫెసర్ జోసెఫ్ స్చోఫర్ తెలిపారు.













