డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల ప్రచారం
కరోనా నుంచి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఓర్లాండో వద్ద ఉన్న సాన్ఫోర్ట్ లో ఆయన ఓ మీటింగ్‌లో పాల్గొన్నారు. 10 రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉన్న ట్రంప్ ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన సభకు హాజరయ్యారు. తాను అద్భుతంగా ఉన్నట్లు చెప్పారు. కరోనా వైరస్ దశ దాటేశానని, అయితే తానినప్పుడు ఆ వైరస్‌కు ఇమ్యూన్ అయినట్లు ట్రంప్ వెల్లడించారు. తాను ఓ శక్తివంతుడి తరహాలో ఫీలవుతున్నట్లు తెలిపారు. నేను నడవగలను అని, ప్రతి ఒక ప్రేక్షకుడికి కిస్ ఇవ్వగలను అని, అబ్బాయిలు, అమ్మాయిలకు కిస్ ఇస్తానని, బిగ్ ఫ్యాట్ కిస్ ఇవ్వాలనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ తేలిన ట్రంప్ మిలటరీ హాస్పిటల్లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అయితే తాజా పరీక్షల్లో ట్రంప్ నెగటివ్ తేలినట్లు వైట్‌హౌజ్ వైద్య బృందం పేర్కొన్నది.













