కాన్యే వెస్ట్ ప్రకటనపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్
నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ర్యాపర్ కాన్వే వెస్ట్ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ట్రంప్‌కి మద్దతు ప్రకటించిన కాన్యే ప్రస్తుతం ఆయనపై పోటీ చేస్తాననడం గమనార్హం. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ కాన్యే పోటీ చేయొచ్చు. పోటీ చేసిన పక్షంలో నాలుగేళ్లలో ఏం జరగబోతుందన్నది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతనికి పలు రాష్ట్రాల్లో తగినంత ఇన్ ఫాస్ట్రక్చర్ లేదు అన్నారు ట్రంప్. 43 ఏళ్ల కాన్వే.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే సుమారు పది లక్షల మంది లైక్ చేశారు.













