డొనాల్డ్ ట్రంప్, కిమ్ చర్చలు విఫలం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ నిర్వహించిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. వియత్నాంలోని హనోయిలో ఈ ఇద్దరు భేటీ అయ్యారు. మెట్రోపోల్ హోటల్ లీ క్లబ్లో వర్కింగ్ లంచ్ సమావేశం నిర్వహించారు. కానీ ఆ ఇద్దరి నేతల మధ్య అణు నిరాయుధీకరణపై ఒప్పందం కుదరలేదని తెలుస్తోంది. ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షల అంశంలో రెండు దేశాల మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. దీంతో సంయుక్తంగా నిర్వహించాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను రద్దు చేశారు. చర్చలు జరిగినా, ఇద్దరి మధ్య ఒప్పందం కుదరలేదని వైట్‌హౌజ్ వెల్లడించింది. గత ఏడాది సింగపూర్‌లో జరిగిన చరిత్రాత్మక భేటీ తర్వాత మరోసారి ఈ ఇద్దరు కలిశారు.













