ఆమెకు సెల్యూట్ చేస్తున్నా : ట్రంప్
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ జెట్ విమాన మహిళ పైలట్ టామ్మీ జో షుల్జ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసిచారు. గత నెలలో విమానానికి చెంది ఓ జెట్ ఇంజన్ గాలిలోనే పేలిపోయి ఓ ప్రయాణికురాలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి మిగతా ప్రయాణికులను కాపాడిన టామ్మీని ఆమె సహా బృందాన్ని ట్రంప్ శ్వేతసౌధానికి పిలిపించి ప్రశంసించారు. ప్రమాదం జరిగిన సమయంలో సౌత్‌వెస్ట్ విమానంలో ఇంతటి ధైర్యవంతులైన సిబ్బంది, ప్రయాణికులు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. టామ్మీ అద్భుతమైన పని తీరు కనబరిచారు. ఆమె గురించి అందరూ చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇన్నేళ్లుగా పైలట్‌గా బాధ్యతు నిర్వర్తించిన టామ్మీకి విమానాన్ని ఎలా ల్యాండ్ చేయాలో తెలుసు కాబట్టి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు ఆమెకు ఆమె సహాయ సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నాను అని ట్రంప్ వెల్లడించారు.
రెండు ఇంజన్లు కలిగిన బోయింగ్ 737 విమానం ఏప్రిల్ 17న 149 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నుండి డల్లాస్ వెళుతుండగా ప్రమాదం సంభవించింది. 3200 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమానం ఎడమ వైపు ఇంజన్ ఆకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరి ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి విమాన ప్రమాదాలు జరగడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.













