కిమ్, ట్రంప్ రెండో భేటీ ఎక్కడో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ నెల చివర్లో మరోసారి భేటీ కానున్నారు. వియత్నాంలో ఈ సమావేశం జరగనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నెల 27,28 తేదీల్లో ఈ భేటీ జరగనుంది. గతేడాది సింగపూర్‌లో ఈ ఇద్దరు నేతలు తొలిసారి భేటీ అయిన విషయం తెలిసిందే. కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పే దిశగా తమ ప్రభుత్వం ముందడుగు వేసిందని ఆయన సృష్టం చేశారు. రెండో స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగంలో భాగంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ఇంకా చాలా పని మిగిలే ఉన్నా.. ఉత్తర కొరియా నేత కిమ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. తాను అధ్యక్షుడిగా ఎన్నిక కాకపోయి ఉంటే ఇప్పుడు నార్త్ కొరియాతో అమెరికా యుద్ధంలో ఉండేదని ఆయన ఆనడం విశేషం.













