న్యూజెర్సీ లో ఎంపీ కవిత జన్మదిన వేడుకలు
టీఆర్ఎస్ యుఎస్ఏ – న్యూజెర్సీ టీం ఆధ్వర్యంలో గౌరవ నిజామాబాదు ఎం పి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల హాజరు అయ్యారు. మహేష్ బిగాల మాట్లాడుతూ దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు పర్యటించిన ఎం పి కవిత ఈలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని అన్నారు. తెలంగాణ ఎన్నారైలకు ఎల్లపుడు అండగా ఉంటుందని, ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని జాగృతి రూపంలో విస్తరింపజేస్తుందని కొనియాడారు. బతుకమ్మ కేవలం తెలంగాణ లోనే పెద్ద పండుగగా ఉండేది, కానీ కవితక్కా జాగృతి స్థాపించిన నాటి నుండి ప్రపంచంలోని తెలంగాణవాదులకు అంతపెద్ద ముఖ్య పండుగ అయిందని అన్నారు.
శ్రీనివాస్ గనగోని మాట్లాడుతూ కవిత తెలంగాణ కోసం పార్లమెంట్ లో అలుపెరగని పోరాటం చేస్తున్న తెలంగాణ ఆడపడుచు అని, వాయిస్ అఫ్ తెలంగాణ అని పేర్కొన్నారు. కవితక్కా ఇపుడు తెలుగు మహిళలందరికీ రోల్ మోడల్ అయిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్వైసరి సభ్యుడు రవి ధన్నపునేని, న్యూజెర్సీ ఇంచార్జి మహేష్ పొగాకు, మీడియా ఇంచార్జి దేవేందర్ రెడ్డి మరియు ఇతర టీఆర్ఎస్ నాయకులూ పాల్గొన్నారు.













