అగ్రరాజ్యంలో తెలుగు వారి తీర్థయాత్ర!

అగ్రరాజ్యంలో తెలుగు సంఘాలు ఎప్పటికప్పుడు కొత్త విధానాలతో కమ్యూనిటీని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్‌లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్) మరో కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. పెన్సిల్వేనియా, న్యూజెర్సీల్లో ఉన్న దేవాలయాల దర్శనాల కోసం ట్రిప్ ప్లాన్ చేసింది. ఆదివారం నాడు మొదలయ్యే ఈ ట్రిప్‌లో మూడు ఆధ్యాత్మిక స్థలాలను దర్శించనున్నారు. పెన్సిల్వేనియాలోని శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్, న్యూజెర్సీలోని బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ మందిరం, న్యూజెర్సీలో ఉన్న సాయి దత్త పీఠం ఈ మూడు ఆధ్యాత్మిక స్థలాలను ఈ ప్రయాణంలో కవర్ చేస్తారు. ఈ టూర్లో పాల్గొనాలంటే ఒక్కొక్కరూ 50 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. టూర్‌కు వచ్చే వారందరికీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉచితంగా అందజేయబడుతుంది. ఈ విషయం తెలిసిన తెలుగు కమ్యూనిటీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి యాత్రలు మరిన్ని ఉంటే బాగుంటుందని అంటున్నారు.