టీఎల్‌సీఏ వార్షిక పోటీలకు ముహూర్తం ఖరారు

అమెరికాలోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టీఎల్‌సీఏ) వార్షిక పోటీలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబరు 24న టీఎల్‌సీఏ ఆధ్వర్యంలో వ్యాస రచన, డ్రాయింగ్/పెయింటింగ్, తెలుగు పద్య పఠనం, క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్, వక్తృత్వ (ఎలక్యూషన్) పోటీలు, కాస్ట్యూమ్ కాంపిటీషన్, ఫిలిం అండ్ ఫోక్ డ్యాన్స్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఐదేళ్ల లోపు చిన్నారులు, 6-9 సంవత్సరాల చిన్నారులు, 10-13 ఏళ్ల పిల్లలు, 14-19 సంవత్సరాల వయసున్న పిల్లలు, అలాగు 20 ఏళ్లుపైబడిన వారి కోసం వేరే వేరే వయోపరిమితుల గ్రూపులకు వేరు వేరుగా పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనాలని అనుకునే వారు ఆదివారంలోపు ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. న్యూయార్క్ నగరంలోని గ్లెన్ ఓక్స్‌లో ఈ పోటీలు నిర్వహించనున్నారు.