గాంధీ కింగ్ కాన్ఫరెన్స్‌కు ప్రముఖుల రాక
భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకుని యుఎస్‌లోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోని మార్టిన్ లూథర్ కింగ్ జూ. రీసెర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అక్టోబర్ 11 నుంచి 13వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ నార్తర్న్ కాలిఫోర్నియా మాజీ అధ్యక్షుడు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాజీ అధ్యక్షుడు జయరామ్ కోమటి ఈ కాన్ఫరెన్స్‌కు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. కాన్ఫరెన్స్ చైర్మన్‌గా తానా మాజీ అధ్యక్షుడు డా. రాఘవేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి పలువురు ప్రముఖులు వస్తున్నారు. దక్షిణాఫ్రికా నుంచి ఇలా గాంధీతోపాటు ఓ డెలిగేషన్ శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయం వచ్చినప్పుడు వారికి జయరామ్ కోమటి, డా. రాఘవేంద్ర ప్రసాద్, కాన్ఫరెన్స్ కో ఆర్డినేటర్ ప్రసాద్ గొల్లనపల్లి ఘనంగా స్వాగతం పలికారు. తరువాత వారు మిల్పిటాస్లోని స్వాగత్ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాన్ఫరెన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ సదస్సులో రాష్ట్రం నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, టూరిజం సెక్రటరీ వెంకటేశం బుర్రా తదితరులు పాల్గొంటున్నారు. జయప్రకాష్ వల్లూరు, ప్రసాద్ తోటకూర, గౌతమ్ మెహ్రా, అమీషా మెహతా, పద్మావతి వెంపటి, బన్నిభూల తదితరులు కూడా సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు.













