చిన్నాపెద్దా అందరినీ ఆకట్టుకునేలా టీఎఫ్ఏఎస్ 40 వసంతాల వేడుకలు

అమెరికాలోని తెలుగు కళా సమితి (టీఎఫ్ఏఎస్) 40 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 8 తేదీన అంటే ఆదివారం నాడు న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ వేదికగా ఈ వేడుకలను జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శ్రీనివాస కల్యాణం, సిరివెన్నెల స్మృత్యాంజలి, అల్లూ రామలింగయ్య స్మృత్యాంజలి, విశ్వనాథ స్మృత్యాంజలి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రముఖ గాయనీ గాయకులు తమ పాటలతో అందరినీ అలరించనున్నారు. అలాగే బిజినెస్ సెమినార్లు, మహిళా సెమినార్లతోపాటు యూత్ అండ్ కల్చరల్ కార్యక్రమాలు, హెల్త్ సెమినార్లు, హెల్త్ క్యాంప్, సీనియర్ సిటిజన్ల హంగామా, సైన్స్ ఫెయిర్ తదితర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని అనుకునే వారు వెంటనే https://tinyurl.com/tfas40tickets లింకులో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు.