హైదరాబాద్ తో సిస్టర్ సిటీ ఒప్పందానికి సిద్ధం – మేయర్ క్రేక్ మోర్గాన్
హైదరాబాద్ నగరంతో తాము సిస్టర్ సిటీ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి సానుకూలంగా ఉన్నట్లు టెక్సాస్ రౌండ్ రాక్సిటీ మేయర్ క్రేక్ మోర్గాన్ తెలిపారు. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని రౌండ్రాక్ సిటీ మేయర్ క్రేక్ మోర్గాన్, సిటీ మేనేజర్ లార్లే హార్లీలు మంగళవారం నగరమేయర్ బొంతు రామ్మోహన్‌ను జీహెచ్ఎంసీ కార్యాలయంలో కలిశారు. హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చిన రౌండ్ రాక్ సిటీ మేయర్ క్రేక్ మోర్గాన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తల బ ందం నగరంలో పెట్టుబడులకు అనుకూల రంగాలపై మేయర్‌తో చర్చించారు. ప్రధానంగా ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, మరింత అధ్యయనం చేస్తామన్నారు. రౌండ్ రాక్ నగరంలో భారతీయులు కూడా ఉన్నారని, తమ నగరాభివ ద్ధిలో వారు మమేకమయ్యారని మేయర్ రామ్మోహన్‌కు వారు వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రపంచంలోని 8 ప్రముఖ నగరాలతో సిస్టర్ సిటీ అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. ఐటీ రంగంలో ప్రముఖ బహుళజాతి సంస్థలన్నీ నగరంలో తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయని ఆయన వివరించారు.













