ఉత్సాహంగా సాగిన టీటీఎస్ పిక్నిక్
యూఎస్ఏలో టెన్నెస్సీ తెలుగు సమితి (టీటీఎస్) వార్షిక పిక్నిక్ సంబరాలు ఘనంగా జరిగాయి. వెయ్యి మందికిపైగా తెలుగు వారు ఈ పిక్నిక్కు హాజరై ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ టీటీఎస్ ధన్యవాదాలు తెలిపింది. టగ్ ఆఫ్ వార్, ఫ్లాష్ మాబ్ వంటి హుషారైన కార్యక్రమాలతో రోజు మొత్తం సరదాగా గడిచిపోయిందని ఇక్కడకు వచ్చిన వారంతా అంటున్నారు. డిజర్ట్ కాంపిటీషన్ సహా పలు క్రీడల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. అలాగే పలువురు తమ గానంతో అందర్నీ అలరించారు. ఉదయం నుంచి ఉత్సాహంగా గడిపిన కమ్యూనిటీ సభ్యులు.. సాయంత్రం మెడిటేషన్ చేసి ఆ అలసట తీర్చుకున్నారు. వివిధ రెస్టారెంట్ల సహకారంతో అందరికీ రుచికరమైన భోజనాలు కూడా అందజేశారు. ఈ పిక్నిక్ ఎంత అద్భుతంగా జరిగిందో తెలియజేస్తూ తీసిన వ్లాగ్ను యూట్యూబ్లో https://youtu.be/8fv9PO2niQg?













