Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్(Praveen) అనే 26 ఏళ్ల యువకుడు.. విస్కాన్సిన్లో ఎంఎస్ చదువుతున్నాడు. స్టోర్లో షాపింగ్ చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మరణించినట్లు కొందరు చెప్తున్నారు. అతని శరీరంపై బుల్లెట్ గాయాలున్నట్లు సమాచారం. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే తండ్రికి ప్రవీణ్ ఫోన్ చేయగా.. నిద్రలో ఉన్న ఆయన ఫోన్ ఎత్తలేదట. ఇప్పుడు ప్రవీణ్ తమను విడిచిపోయాడనే విషయం తెలిసిన అతని తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ప్రవీణ్ మరణానికి కారణం పోస్టుమార్టం తర్వాత తెలుస్తుందని యూఎస్ అధికారులు తెలిపారు. ప్రవీణ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సహాయం చెయ్యాలంటూ.. అతని తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర నేతలను కలిసినట్లు సమాచారం.







