Telugu People Foundation: ఘనంగా తెలుగుపీపుల్ ఫౌండేషన్ పదహారవ వార్షికోత్సవం
తెలుగుపీపుల్ ఫౌండేషన్(Telugu People Foundation) పదహారవ వార్షికోత్సవం న్యూజెర్సీలో విజయవంతంగా జరిగింది. మొత్తం ఐదు వందల మందికి పైగా కాలేజీ విద్యార్థులకు తెలుగుపీపుల్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకూ సాయం చేసిందని, భారత దేశంలోని అన్ని ప్రధాన ఐఐటీలలో తెలుగుపీపుల్ ఫౌండేషన్ విద్యార్థులు ఉన్నారని అధ్యక్షులు కొత్త కృష్ణ స్టేజీ మీద తమ ప్రసంగంలో పేర్కొన్నారు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఫౌండేషన్ లో నిరంతరం కేవలం విద్యార్థులకోసం పనిచేస్తున్న టీము సభ్యులు, దాతలు, సహాయకులు, స్పాన్సర్లు అందరూ గర్వపడేలా విద్యార్థులు విజయాలను సాధిస్తున్నారని ప్రసాద్ కునిశెట్టి పేర్కొన్నారు.
సుమారు 35 మంది యువ వలంటీర్లు అమెరికాలో విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇచ్చే బాధ్యతను తీసుకున్నారని, దాతలు, యువత, వలంటీర్లలో తెలుగు సంతతికి చెందిన వారే కాక మిగిలిన వారు కూడా ఉండడం ఫౌండేషన్ చేస్తున్న అద్వితీయమైన సేవలకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ వేడుకలకోసం
అద్భుతమైన క్వాలిటీ, రుచితో భోజన సదుపాయాలు సమకూర్చిన వివిధ రెస్టారెంట్ల యాజమాన్యాలకు, డైనింగ్ హాలు వాలంటీర్లకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఫౌండేషన్ కార్యక్రమానికి ఉచితంగా తమ వంతు సహాయం అందించడమే కాక, విరాళాలు కూడా ఇచ్చిన గాయనీ గాయకులకు, మీడియా, ఫొటో గ్రాఫర్లకు కూడా నిర్వాహకులు నమస్సులు తెలియజేశారు.
TeluguPeople.org ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఆర్థిక సహాయం చేయదలచిన వారు treasurer@telugupeople.org కు Zelle చేయవచ్చు.







