ఎన్నారైల వితరణకు జగన్ ప్రశంసలు
వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ నగరంలో ఉన్న తెలుగు ప్రవాసాంధ్రులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎనిమిది లక్షల ఇరవై రూపాయలు పంపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి ధన్యవాదలు చెబుతూ, అమెరికాలో ఉన్నా, మాతృదేశాన్ని మరవకుండా కష్టకాలం లో ఆదుకుంటున్న ప్రవాసాంధ్రులు అందరినీ అభినందించారు. కరోనా కష్టకాలం లో ఆంధప్రదేశ్ లో సమర్ధవంతం గా పనిచేస్తున్న వై ఎస్ జగన్మోహన రెడ్డి కృషిని డా. వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ (యుఎస్ఎ) అభినందించిది. ఈ సేవా కార్యక్రమం యాడికి జగన్మోహన రెడ్డి గారి పర్యవేక్షణలో జరిగింది. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి పర్యవేక్షిస్తున్న డాక్టర్ హరికృష్ణ ముక్తాపురంకు కూడా ఎన్నారైలు కృతజ్ఞతలు తెలిపారు.













