సీటెల్ లో టాటా బోర్డ్ సమావేశం
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) బోర్డ్ సమావేశం సీటెల్‌లో ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి టాటా ప్రముఖులుప ఈ సమావేశానికి హాజరయ్యారు. సీటెల్‌లోని టాటా ప్రాంతీయ నాయకులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. టాటా నాయకుడు పైళ్ళ మల్లారెడ్డితోపాటు, విక్రమ్ జంగం, హరనాథ్ పొలిచెర్ల, శ్రీనివాస్ మానాప్రగడ, భరత్, వెంకట్ ఎక్కా, నీలహిత, శ్రీనివాస్ గనగోని, మోహన్ పాటలోళ్ళ తదితరులు ఈ బోర్డ్ సమావేశంలో పాల్గొన్నారు. బోర్డ్ సమావేశం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని గుర్తుకు తెస్తూ ప్రదర్శించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.













