తెదేపా మహానాడుకు భారీ ఏర్పాట్లు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి విదేశాల్లోనూ మహానాడు జరుగనుంది. అమెరికాలోని డాలస్లో ఈ నెల 27, 28 తేదీల్లో తెదేపా ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో మహానాడు నిర్వహిస్తున్నా అక్కడి ప్రవాసాంధ్రుల్లో ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానులు తెదేపా మద్దతుదారులు ఉన్నారు. తెదేపా జాతీయ మహానాడు ఈ నెల 27, 28 29 తేదీల్లో విజయవాడలో జరుగుతోంది. అమెరికాలోనూ అదే సమయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 3 వేల మంది దీనికి హాజరవుతారని ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కోమటి జయరాం తెలిపారు. పార్టీ తరపున మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్, సీనియర్ నాయకుడు ఇ.పెద్దిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని జయరాం వివరించారు.













