అమెరికా కోర్టులో టీసీఎస్ కు ఊరట
అమెరికా కోర్టులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు ఊరట లభించింది. ఎపిక్ సిస్టమ్స్‌తో మేధో సంపత్తి హక్కుల విషయంలో టీసీఎస్‌పై విధించిన అపరాధ రుసుమైన 280 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,098 కోట్లు) రాజ్యాంగపరంగా అధికమేనని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ అభిప్రాయపడింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్చేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది. అయితే పరిహార రుసుమైన 140 మి. డాలర్లను మాత్రం కట్టాల్సిందేనని తీర్పునిచ్చినట్లు కూడా అందులో వెల్లడించింది. ఏప్రిల్ 16, 2016లో అమెరికా కోర్టు ఒకటి మేధో సంపత్తి హక్కుల కేసులో టీసీఎస్‌కు 940 మి. డాలర్ల అపరాధ రుసుము విధించింది. ఆ తర్వాతి ఏడాది ఆ రసుమును 420 మి. డాలర్ల (280+140)కు తగ్గిచింది. అయితే యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్‌కు కంపెనీ వెళ్లడంతో తాజా తీర్పు వెలువడింది.













