తానా ఆధ్వర్యంలో అమెరికా- ఇండియా డాక్టర్లచే కోవిడ్ 19 హోమ్ కేర్ గైడెన్స్ వెబినార్ 5న
ప్రస్తుతం కోవిడ్ 19 సంక్షోభం వల్ల అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది ఇబ్బందులు పాలవుతున్నారు. చాలామంది కోవిడ్19 భయంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం కోవిడ్ 19పై ఉన్న భయాందోళనలను పోగొట్టేలా, కోవిడ్ సోకినా, సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్న విషయాలపై సెప్టెంబర్ 5వ తేదీన అమెరికా, ఇండియాలోని డాక్టర్లతో ఓ వెబినార్‌ను ఏర్పాటు చేసింది. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, తానా ఫౌండేషన్ అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు ఆధ్వర్యంలో ఈ వెబినార్ జరుగుతోంది. ఆపి, ఎపిఎన్ఆర్టీఎస్ దీనికి సహకారాన్ని అందిస్తోంది.
డాక్టర్ లోకేష్ ఈదర, అలెర్జీ, ఇమ్యూనాలజీ నిపుణులు, డాక్టర్ రాజా తాళ్ళూరి- ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు, డాక్టర్ సుభాకర్ రెడ్డి-పల్మనాలజిస్ట్ (హైదరాబాద్), డాక్టర్ అన్నె సురేష్ – అలెర్జీ & ఇమ్యునాలజీ, డాక్టర్ ప్రసాద్ మువ్వ- ఫ్యామిలీ మెడిసిన్ స్పెషలిస్ట్, డాక్టర్ కనుమూరి బసవ శంకరరావు- అలెర్జీ అండ్ ఇమ్యూనాలజీ (విజయవాడ), డాక్టర్ చంద్రశేఖర్ కోనేరు – ఇంటర్నల్ మెడిసిన్ ఈ వెబినార్‌లో పాల్గొని కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చేపట్టాల్సిన రక్షణ చర్యలను తెలియజేస్తున్నారు.













