విజయవంతముగా ముగిసిన తానా ఫౌండేషన్ మెగా ఐ క్యాంపు
బాపట్ల జిల్లా ధేనువుకొండ గ్రామం నందు తానా ఫౌండేషన్, శంకర్ ఐ ఫౌండేషన్ సంయక్తముగా అక్టోబర్ ఇరభై మూడవ (October 23 2022) తేదీ మెగా ఐ క్యాంపు నిర్వహించడం జరిగినది. సుమారు మూడువందల పైగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ కళ్ళ జోళ్ళు పంచడం జరిగినది. డెబ్భై మందిని కంటి ఆపరేషన్ కొరకు చేయడం జరిగినది. కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలు తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ మెగా ఐ క్యాంపు కార్యక్రమం కి.శే నలజల వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం అయన మనుమరాలు కుమారి నలజల గాయత్రి స్పాన్సర్ చెయ్యడం జరిగినది. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.













