తానా వెంటి లెటర్స్ మరియు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ పంపిణీ

తానా సంస్థ వారు తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ గారి సారధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. గత సంవత్సరం, కరోనా కారణంగా, అన్నార్తులు గా మారిన అనేక మంది పేద వారికి, నిత్యావసర వస్తువులు లక్షల రూపాయలు వెచ్చించి, నిరంతరం ఒక యజ్ఞంలా సేవా కార్యక్రమాలు చేపట్టారు, మళ్లీ రెండో దశ కరోనా విజృంభిస్తున్న తరుణంలో, ఈరోజు శ్రీ మిట్టపల్లి పాండురంగారావు గారి సారథ్యంలో, పట్టణంలో ప్రముఖ ఆసుపత్రులు లైన, ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న గాయత్రి హాస్పిటల్ (డాక్టర్ నాగరాజు గారు) కు మరియు సందీప్(డాక్టర్ కంభంపాటి రంగారావుగారు) పిల్లల ఆసుపత్రికి 5 లక్షల రూపాయల విలువైన, 2 వెంటి లెటర్స్ మరియు 4 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్, గౌరవ శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి స్వహస్తాలతో అందజేశారు.
ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తానా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన జయశేఖర్ తాళ్లూరి గారికి, తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు గారికి, తానా కల్చరల్ కోఆర్డినేటర్ శిరీష తునూగుంట్ల గారికి, సురేష్ మిట్టపల్లి గారికి, తాళ్లూరి శ్రీధర్ గారికి, సుమంత్ రామిశెట్టి గారికి, ఇతర నూతన కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సభలో ప్రసంగించిన పెద్దలు తానా సంస్థ వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ తానా కార్యవర్గాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ గారు, శ్రీనగర్ ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ గారు, మాజీ కౌన్సిలర్ శ్రీ దుర్గా ప్రసాద్ గారు, డాక్టర్ రమేష్ బాబు గారు,డాక్టర్ నాగరాజు గారు, డాక్టర్ భూపతి రావు గారు,డాక్టర్ రంగారావు గారు డాక్టర్ విజయ్ కుమార్ గారు, డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారు, వసుంధర షాపింగ్ మాల్ అధినేత తాటిపల్లి శంకర్ బాబు గారు, మిట్టపల్లి మురళి గారు, కొల్లా నరసింహారావు గారు, ఓం మెడికల్స్ రవి గారు పాల్గొన్నారు.