మిసిసిపి తానా ఆధ్వర్యంలో స్కూల్బ్యాగ్ల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బ్యాక్‌ప్యాక్ పథకం కింద అమెరికాలోని పేద పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లను, కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. మిసిసిపిలోని తానా నాయకులు బ్యాక్ ప్యాక్ పథకం కింద కామ్డెన్లోని కామ్డెన్ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు స్కూల్బ్యాగ్లను, కిట్లను పంపిణీ చేశారు.
దాదాపు 150 స్కూల్ బ్యాగ్‌లను స్కూల్‌కు ఇచ్చినట్లు తానా నాయకులు తెలిపారు. బ్యాగ్‌లను అందుకున్న చిన్నారుల ముఖాల్లో కనిపించిన సంతోషం చెప్పలేనదని తానా నాయకులు పేర్కొంటూ ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించినవారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు డా. సుధీర్ రెడ్డి తంగెళ్ళ, వెంకట యార్లగడ్డకు, తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్య చౌదరిలావు, మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, కార్యదర్శి రవి పొట్లూరి, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, కమ్యూనిటీ చైర్ మల్లిఖార్జున్ వేమన, అశోక్‌బాబు కొల్లా, కిరణ్ గోగినేని, రామ్‌చౌదరి ఉప్పుటూరి తదితరులకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. తానా బ్యాక్‌ప్యాక్ పోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ సత్యనారాయణ మన్నెకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.













