హోమ్ గార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా తానా ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ
రోడ్డు ప్రయాణాల్లో ప్రమాదాల భారిన పడుతున్న వారిని చైతన్య పరిచేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2000 హెల్మెట్లను అందయజేయటం జరిగింది.
అందులో భాగంగా నేడు హోమ్ గార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా విజయవాడకు చెందిన సుదీక్షణ్ ఫౌండేషన్ వారి నేతృత్వంలో ఈరోజు అనగా 6-12-2020 తేదీన ఆదివారం మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఎం.రవీంద్రనాధ్ బాబు, IPS, గారి చేతులమీదుగా హెల్మెట్లు, రగ్గులు అందజేయటం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రవీంద్రనాధ్ బాబు మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సుకై తానా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందని, ఈ సందర్భంగా తానా ప్రెసిడెంట్ జయ్ తాళ్లూరి గారికి, చైర్మన్ నిరంజన్ శృంగవరపు గారికి మరియు సభ్యులకు ఆయన ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎడిషనల్ ఎస్పీ, క్రైమ్ బ్రాంచ్ డిఎస్పీ, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమం సుదీక్షణ్ ఫౌండేషన్ ఫౌండర్ చిగురుపాటి విమల గారి నేతృత్వంలో జరిగింది. కార్యక్రమంలో తానా తరపున బషీర్ షేక్, కాకాని తరుణ్ పాల్గొన్నారు.













