యువ తరం చేతుల్లో కదం తొక్కుతున్న తానా !
గడిచిన 5-6 ఎళ్ల లో తానా లో చేరిన, చేరుతున్న యువత సంఖ్య గణనీయం గా పెరిగిందనటం లో ఎలాంటి సందేహం లేదు. అలాగే గత 2-3 తానా నాయకులను చూస్తే లీడర్ షిప్ సగటు వయస్సు 40+ కి తగ్గి.. నాయకత్వం లో మార్పులు కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు సతీష్ వేమన దగ్గర నుంచి రీజినల్ రెప్రెజెంటేటివ్స్ వరకు…. అందరు యువకులే..
‘యువకులకు ఉత్సాహం ఎక్కువే.. దూకుడు ఎక్కువే ..’ అంటూ కొందరు పెద్దలు కంగారు పడ్డ మాట కూడా వాత్సవమే. కానీ ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాలలో అందరి ఊహలకు అందనంత ఎత్తులో తానా కార్య క్రమాలు జరుగుతున్నాయి.
మొదటలో కేవలం హైదరాబాద్ లో జరిగే తానా కార్య క్రమాలు, గత 10 ఎళ్ల లో మెల్ల గా హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి లలో కూడా జరగటం మొదలు అయ్యాయి.
ఈ కార్య క్రమాలు ఈ సంవత్సరం దాదాపు 20 పట్టణాలలో జరుగుతూ ఉన్నాయంటే అధ్యక్షుడు సతీష్ వేమన ను, ఇతర నాయకులను తప్పని సరిగా అభినందించాలి. “రైతు కోసం ” అని ముందు గా అమెరికా లోనే విరాళాలు సేకరించి, ఇప్పుడు తెలుగు నెల మీద దాదాపు కోటి రూపాయలు విలువ చేసే సేవా కార్యక్రమాలు చెయ్యటం హర్షణీయం..
తానా కాబోయే అధ్యక్షుడు జయ్ తాళ్లూరి డిసెంబర్ 28 న ఖమ్మం – కొత్త గూడెం లో అత్యంత వేడుక గా తానా చైతన్య స్రవంతి పేరున కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు (3 జనవరి) న తానా అధ్యక్షుడు సతీష్ వేమన కడప జిల్లా రాజాం పెట- తాళ్ల పాక లో 5 జనవరి తేదీన ప్రతిష్టాత్మకం గా నిఇర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్రటరీ అంజయ్య చౌదరి విజయవాడ లో 8 జనవరి న జరగబోయే ఏర్పాట్ల ను స్వయం గా పర్యవేక్షణ చేస్తున్నారు. ట్రెజరర్ రవి పొట్లూరి కర్నూల్ పట్టణం లో 12 జనవరి న జరగబోయే కార్యక్రమ ఏర్పాట్లు చూసుకొంటున్నారు.
అంటే అనేక కార్యక్రమాలు చెయ్యాలని నిర్ణయం తీసుకోవటం తో బాటు… పని/ బాధ్యత విభజన కూడా చేసుకొని తానా లీడర్ షిప్ మొత్తం ఈ విధం గా చైతన్య స్రవంతి కార్యక్రమాలు విజయ వంతం గా నిర్వహించటం నిజం గా గొప్ప మార్పే! ఇది చాలా మంచి పరిణామామే!













