TANA: మిన్నియా పొలిస్‌లో తానా బ్యాక్ ప్యాక్ విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) నార్త్ సెంట్రల్ టీమ్ బ్యాక్ ప్యాక్ కార్యక్రమంలో భాగంగా మిన్నియా పోలిస్ బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. దాదాపు 100 మంది విద్యార్థులకు నార్త్ సెంట్రల్ టీమ్ ప్రతినిధులు.. రామ్ వంకిన, ప్రతినిధులు వేదవ్యాస్ అర్వపల్లి, మురళీ కృష్ణతోపాటు శ్రీమాన్ యార్లగడ్డ బ్యాగులను అందజేశారు. యూఎస్‌లోని కమ్యూనిటీకి తమ వంతుగా సేవలందించాలనే ఉద్దేశ్యంతో తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లావు నాయకత్వంలో ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రతినిధులు వెల్లడిరచారు. ఈ కార్యక్రమాన్ని రామ్ వంకిన స్పాన్సర్ చేశారు. కార్యక్రమాన్ని సమన్వయపరిచినందుకు తానా కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ సాయి బొల్లినేని, కోశాధికారి రాజా కసుకుర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి తానా నార్త్ సెంట్రల్ వాలంటీర్స్ వెంకట్ జువ్వ, జయరాం నల్లమోతు, సలాది నాయుడు, అజయ్ తాళ్లూరి, రామకృష్ణ అన్నే, సురేష్ బొర్రా, రావు గుత్తా, కోటేశ్వరరావు పాలడుగుతోపాటు రామరాజు కనుమూరి సహాయ సహకారం అందించారు.
తానా కమ్యూనిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ నిర్వహకులు, టీచర్లు ప్రశంసించారు. తానా బ్యాక్ ప్యాక్ కింద తమ స్కూల్‌ను ఎంపిక చేసుకుని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసినందుకు వారు తానా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.