TAGC: చికాగో తెలుగు సంఘం ఆధ్వర్యంలో దసరా-దీపావళి సంబరాలు
ఉత్తర అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థలలో ఒకటైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (TAGC) ఆధ్వర్యంలో నవంబర్ 8న దసరా, దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇల్లినాయిస్లోని నేపర్విల్లేలోని యెల్లో బాక్స్ వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు జరగనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 1:00 నుండి 5:00 వరకు సాంస్కృతిక ప్రదర్శనలు (Cultural Performances), సాయంత్రం 5:00 నుండి 6:00 వరకు విందు భోజనం (Dinner), సాయంత్రం 6:00 నుండి 10:00 వరకు ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ (Mani Sharma) లైవ్ సంగీత కచేరీ (Music Concert) ఏర్పాటు చేయనున్నారు. సభ్యులకు, పార్టిసిపెంట్స్కు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రవేశం ఉచితం. సభ్యులు కాని వారు ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే 20 డాలర్లు, వేదిక వద్ద టికెట్ తీసుకుంటే 25 డాలర్ల ధర పలుకుతుంది. సంగీత కచేరీకి కూడా సభ్యులకు, ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం. సభ్యలు కాని వారు టికెట్ తీసుకుంటే ఆన్లైన్లో $30, ఆన్సైట్లో ధరన $35. రెండు కార్యక్రమాల్లో సభ్యులకు, ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం. అదే రెండు కార్యక్రమాలకు కలిపి టికెట్ తీసుకుంటే ఆన్లైన్లో 40 డాలర్లు, ఆన్సైట్లో 45 డాలర్లుగా టీఏజీసీ (TAGC) నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీఏజీసీ (TAGC) ప్రెసిడెంట్ రమణా కాల్వ, చైర్ శిరీష మద్దూరి, కో చైర్లు స్వాతి బండి, రామ కళ్ళి కృషి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం www.tagc.org వెబ్సైటును సందర్శించవచ్చని టీఏజీసీ తెలిపింది.







