టిఎజిసి బతుకమ్మ వేడుకలు సక్సెస్
చికాగోలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (టిఎజిసి) ఆధ్వర్యంలో వర్చువల్‌గా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎంతోమంది మహిళలు పాల్గొని బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. కోవిడ్ 19 జాగ్రత్తలను తీసుకుని నిర్వహించిన ఈ వేడుక విజయవంతంగా జరగడంపట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 170 మంది ఈ వేడుకల్లో పాల్గొనడం?విశేషం. బతుకమ్మ వేడుకలను సంప్రదాయంగా ఇంతమందితో పలు జాగ్రత్తలు తీసుకుని నిర్వహించినట్లు టిఎజిసి ప్రెసిడెంట్ ప్రవీణ్ వేములపల్లి, సాంస్కతిక సభ్యులు, సంస్థ కార్యవర్గ సభ్యులు తెలిపారు. మానస లట్టుపల్లి, అర్చన పొద్దుటూరి, స్మిత గంట ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. గ్రూపు లీడర్లు, వలంటీర్లు ఈ కార్యక్రమం?విజయవంతానికి సహకరించారు. అమెరికన్ తెలంగాణ సొసైటీ (ఎటిఎస్), ఈవెంట్ పార్టనర్‌గా వ్యవహరించిన మాల్ ఆఫ్ ఇండియా (వినోజ్ చనుమోలు), మీడియా పార్టనర్ యోయోటీవి ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించారు. యాంకర్, సింగర్ శృతి, సింగర్ వర్మ లైవ్‌లో అందరినీ తమ మాటలు, పాటలతో ఉత్సాహపరిచారు.













