TACO: టాకో ముగ్గుల పోటీలు విజయవంతం
 
                                    సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (TACO) ఆధ్వర్యంలో స్థానిక చిన్మయ మిషన్లో సంక్రాంతి(Sankranti) ముగ్గుల పోటీలు నిర్వహించారు. 400మంది ప్రవాస పిన్నలు, పెద్దలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ముగ్గుల పోటీలతో పాటు గాలిపటాల తయారీ, ఫ్యాన్సీ డ్రెస్, చిత్రలేఖనం, కోలాటాలు వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్థానిక సాహితీవేత్త పుట్టా పెను రచించిన ‘‘సీమ చరిత’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంస్థ అధ్యక్షుడు మావులేటి కాళీప్రసాద్ రాజు, సాంస్కృతిక ఉపాధ్యక్షురాలు బల్లెకారి హారిక, కార్యవర్గ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొని ఏర్పాట్లను సమన్వయపరిచారు. విజేతలకు బహుమతులను అందజేశారు.











