TACO: టాకో సంక్రాంతి వేడుకలు
 
                                    ఆహా!! ఎంత శోభాయమానం! తెల్లటి మంచు కుప్పలు దాటి టాకో(TACO) వారు నిర్వహించిన సంక్రాంతి రంగోలి ముగ్గుల పోటీల స్థలం, సంక్రాంతి(Sankranti) వాతావరణం ఉట్టిపడేలా అందమైన అలంకరణలతో, పిల్లా పెద్దా కలిపి నాలుగు వందల మందికిపైగా అందమైన రంగు రంగుల దుస్తులతో కళ్లకింపుగా చాల కోలాహలంగా ఉండింది.
టాకో ప్రెసిడెంట్ కాళీ ప్రసాద్ రాజు మావులేటి గారి ఆధ్వర్యంలో, కల్చరల్ వైస్ ప్రెసిడెంట్ హారిక బల్లెకారి, 2025 ఈసీ కమిటీ సభ్యుల సహాయంతో ఆద్యంతమూ కన్నులపండుగగా కార్యక్రమాన్ని నడిపించారు. 150 కి పైగా పిల్లలు, పెద్దలు రంగోలి, డ్రాయింగ్/పెయింటింగ్, గాలి పటాల తయారీలు, పిల్లలకు ఫాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించడం, కొల్లాటాలు, చాల అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమాం, నూతన సంవత్సరానికి శుభారంభంలా అనిపించిన భావన. పోటీలలో గెలిచిన వారికి బహుమతులతో పాటు, పోటీలలో పాల్గొన్న పిల్లలందరికీ ప్రోత్సాహక జ్ఞాపికలను కూడా అందజేసి వారి ఔత్సాహికతను పెంపొందింప చేశారు.
కొలంబస్ సాహితీవేత్త పెను పుట్టా గారు రచించిన ” సీమ చరిత” పుస్తకాన్ని ఆవిష్కరించి వారి తెలుగు భాషాభిమానాన్ని చాటుకున్నారు.
ఈ విధంగా జనవరి పదకొండు సాయంత్రం చిన్మయ మిషన్ వారి సభా ప్రాంగణం టాకో 2025 ఈసీ టీమ్ వారు ఈ సంవత్సరానికి సంక్రాంతి కార్యక్రమంతో తెర ఎత్తి ఆ నాటి కార్యక్రమానికి అందరికి ఆనందంగా ఆహ్లాదంగా వీడ్కోలు చెప్పారు.











