TACO: వైభవంగా టాకో దీపావళి సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఓహయో (TACO) 40 వసంతాలు పూర్తి చేసుకుంటూ మధ్య ఓహయోలో మరీ ముఖ్యంగా కొలంబస్(Columbus) తెలుగు వారికి సేవలు అందిస్తున్న సంస్థ. 7వ తేది డిసెంబరు, 2024 న టాకో దీపావళి సంబరాలు బెర్లిన్ మిడిల్ స్కూల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. 2024 టాకో అధ్యక్షులు ప్రసాదు కాండ్రు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు చాలా చక్కగా జరిగాయి. పిల్లలు, పెద్దలు అనేకనేక సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు వారి భాష, యాస, పాట, ఆటలలో ఆసాంతం అలరించారు.
అదే విధంగా, ప్రసాదు గారు పాత టాకో అధ్యక్షులందరిని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. సుమారు 700 మందికి పైగా పాల్గొన్న టాకో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పవచ్చు. అదేవిదంగా ఈ సంబరాలలో 2025 టాకో అధ్యక్షులు శ్రీ కాళీ ప్రసాదు గారు తన ముఖ్యమైన టీమును కూడా సభకు పరిచయం చేసారు.
సాయంత్రం చక్కని అచ్చ తెలుగు విందుతో 40వ టాకో దీపావళి సంబరాలు ముగిసాయి. ఈ సంబరాలలో ప్రత్యక్షంగా పాల్గొన్న తెలుగు వారందరికీ, పరోక్షంగా సహకరించిన దాతలకు, మిగతా తెలుగు వారందరికీ టాకో సంస్థ అభినందనలు తెలియజేసుకుంటుంది. 2025 టాకో టీము చాలా మంచి ప్రోగ్రాం తో మీ ముందుకు వచ్చి అలరించేదానికి సన్నద్ధమవుతుంది, దీనికి మీ సహాయ సహకారాలు ఆశిస్తున్నాము.







