TACO: టాకో సంక్రాంతి వేడుకలు
 
                                    తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో (TACO) 2025 సంక్రాంతి సంబరాలను ఫిబ్రవరి 2, 2025న ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు 1200 మందికి పైగా ఆహుతులు హాజరై ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన వివిధ వినోద కార్యక్రమాలను తిలకించి ఆనందించారు. ఈ సంక్రాంతి వేడుకల సందర్భంగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్ మరియు బిగ్ బాస్ ఫేమ్ అనీ మాస్టర్ కొలంబస్ కు విచ్చేసి వారం రోజులపాటు డాన్స్ వర్క్ షాప్ నిర్వహించి అందులో పాలుపంచుకున్న వారితో కలిసి సంక్రాంతి సంబరాల ఈవెంట్ లో ప్రత్యేక ప్రదర్శన తో అలరించారు. వీరితో పాటు హనుమాన్ చాలీసా, జయహో, సంక్రాంతి స్పెషల్ లాంటి ఎన్నో ప్రదర్శనలు అతిధులను విశేషంగా అలరించాయి.
ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రపంచంలోనే తొలిసారిగా కొలంబస్ ప్రముఖులతో నిర్విహించబడిన టాకో బిగ్ బాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ కి ప్రత్యేక అతిధిగా నీరజ్ అంతాని విచ్చేసి టాకో అధ్యక్షులు కాళీ ప్రసాద్ రాజు మావులేటి గారి తో కలిసి చంద్ర రాయల మరియు భాస్కర రుద్రరాజు గార్లకు వారు చేసిన సేవలకు గాను సత్కరించి అభినందించారు.
చివరలో ఏర్పాటు చేయబడ్డ సంక్రాంతి ప్రత్యేక విందు తో కార్యక్రమాలు ఘనంగా ముగిసాయి. ఈ కార్యక్రమానికి టాకో తరపున హారిక బల్లెకారి, నీలిమ ఎలమంచిలి, సుప్రియ, వర్ష, హారిక సి, విషు, ప్రదీప్ తదితరులు సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించగా, రామ్ గద్దె మరియు రాజేష్ చెరుకూరి ఆధ్వర్యంలో టాకో బృందానికి చెందిన రాజ్ వంటిపల్లి, సంపత్, స్వామి, రాఘవ్, మాధురి, భరత్, రాజు, సాకేత్, మహేష్, మనోజ్, శ్రీహరి, సంజయ్, శ్రీరామ్ తదితర కార్య నిర్వాహక బృందం అతిధులకు డిన్నర్ అందించి కార్యక్రమానికి ముగింపు పలికారు.











