అమెరికా సామాజిక కార్యకర్తకు శ్రీలంక క్షమాపణలు
శ్రీలంక పేలుళ్లకు బాధ్యులంటూ ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళల పోటోలను, వారి పేర్లతో సహా లంక ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వరుసలో అమరా మజీద్ అనే అమెరికా ముస్లిం మహిళ ఫొటోను పోరపాటున జత చేశారు. అబ్దుల్ కదీర్ ఫాతిమా ఖాదియా అనే ఉగ్రవాద నాయకురాలు ఫొటో, పేరుకు బదులు మజీద్వి ప్రచురించినట్టు తెలుసుకొని పోలీసు శాఖ నాలుక కరుచుకొంది. జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరి.. ఫోటో సరిచేసింది. భారత్ అందించిన దాడుల సమాచారం ఆధారంగా సమగ్ర రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలం చెందామంటూ అంతకుముందు ఓసారి క్షమాపణ చెప్పింది.













