గేమ్స్ ద్వారా సామాజిక సమస్యల పరిష్కారం
గేమ్స్ ద్వారా సామాజిక సమస్యల పరిష్కారానికి యూఎస్ కాన్సులెట్, ఇండో అమెరికన్ సెంటర్ సంయుక్తంగా నాలుగురోజుల పాటు గేమింగ్ డిప్లొమసీ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. హైదరాబాద్ టీహబ్‌లో ఈ నెల 25 నుంచి 28 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. యూఎస్ కాన్సులెట్ జనరల్ కేథరిన్ హడ్డా, తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గేమ్స్ కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల చర్చాగోష్ఠులు సాగనున్నాయి. నైపుణ్యవంతులైన ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని జయేశ్‌రంజన్ పేర్కొన్నారు. టీహబ్ వేదికగా అమెరికా కాన్సులేట్ ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. దాదాపు 60 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు.













