వేలంలో గాంధీ కళ్లద్దాల విలువ ఎంతో తెలుసా!
దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ ధరించిన బంగారు వృత్తాకారపు కళ్లజోడు ఇటీవల వేలం పాటలో అత్యంత భారీ మొత్తానికి అమ్ముడు పోయింది. మూడు వారాల క్రితం దక్షిణాఫ్రికాలోని బ్రిస్టల్ల్లో నిర్వహించిన ఈ వేలం పాటలో ఆ కళ్లజోడు సుమారు 260,000 పౌండ్లకు అమ్ముడుపోవడంతో దాని యాజమాని హర్షం వ్యక్తం చేశాడు. ఈ కళ్లజోడును దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో మహత్మా గాంధీ ధరించారు. ఈ అరుదైన వస్తువును అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. గాంధీజీ కళ్లద్దాలకు రిజర్వ్ ధరను 15,000 పౌండ్లుగా నిర్ణయించారు. అయితే దీనిని సొంతం చేసుకునేందుకు భారతదేశంతో సహా వివిధ దేశాల నుండి చాలా మంది ఆసక్తి చూపించినట్లు వేలం నిర్వహకుడు ఆండీ స్టోవ్ పేర్కొన్నాడు.













