కప్పట్రాళ్ళకు అవార్డు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామాన్ని స్మార్ట్విలేజ్, స్మార్ట్ వార్డ్ ప్రోగ్రామ్ కింద గుర్తించడంతోపాటు కప్పట్రాళ్ళ గ్రామం ఫ్యాక్షన్ ముద్రను చెరిపేసుకుని అభివృద్ధి చెందిన గ్రామంగా మారిందని ప్రశంసించింది. గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రగతిపథంలో నడిపిన ఐపిఎస్ అధికారి రవికృష్ణను అభినందిస్తూ అవార్డును అందజేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఈ అవార్డును రవికృష్ణ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కప్పట్రాళ్ళ అభివృద్ధికి కృషి చేసిన తానా కోశాధికారి రవి పొట్లూరి కూడా పాల్గొన్నారు.













